హిందువులు సందర్శించే పుణ్య క్షేత్రాల్లో అమర్ నాథ్ గుహ ఒకటి. ఈ టెంపుల్ భారత్ లోని జమ్మూ కశ్మీర్ లో ఉంది. హిమాలయాల్లోని దక్షిణ కొండల్లో ఉన్న ఈ క్షేత్రానికి పహల్గాం గ్రామం నుంచి వెళ్లాలి. అయితే ప్రతి సంవత్సరం జులై సమయంలో అమర్ నాథ్ గుహలో మంచు శివలింగం ఏర్పడుతుంది. సహ లింగ రూపంలో ఉన్న మహా దేవున్ని దర్శించుకునేందుకు ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తు తుంటారు.


అయితే భక్తులు గుహను చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. గందేర్బల్  జిల్లాలోని బల్తార్ బేస్ లేదా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం బేస్ నుంచి భక్తులు నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొంతమంది గాడిదలు, గుర్రాలపై వెళ్తుంటే మరికొందరు డోలీల సాయంతో వెళ్తుంటారు. ఇక డబ్బు పలుకుబడి ఉన్న వాళ్లు హెలికాఫ్టర్లో వెళ్తారు.


అయితే ఎలా వెళ్లినా ఈ యాత్ర పమాదంతో కూడుకున్నదే. చుట్టూ మంచు, సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఈ దశలో కేంద్రం భక్తుల సౌకర్యార్థం బల్తాల్ బేస్ నుంచి అమర్ నాథ్ గుడి వరకు రోడ్డును నిర్మించాలని భావించింది. ఇంత వరకు బాగానే ఉన్నా తాజాగా ఈ రోడ్డు నిర్మాణంపై వివాదం నెలకొంది. హిందూ మతంపై ద్వేషంతో అమర్ నాథ్ ఆలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవాలని పాకిస్థాన్ ప్రోద్భలతో కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి వారికి బీబీసీ అండగా నిలబడి పర్యావరణ సాకుతో రోడ్డు నిర్మాణంపై అనేక వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోంది. తాజాగా బీబీసీలో ఓ కథనం ప్రచురితమైంది.


ఇలాంటి నిర్మాణాలతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని.. భవిష్యత్తులో భారీ ప్రమాదాలు నెలకొనే ముప్పు కూడా ఉందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ఇలాంటి సున్నితమైన ప్రాంతంలో రోడ్డు నిర్మించడంతో నిపుణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాజకీయ పార్టీలు ప్రకటనలు కూడా జారీ చేశాయి. చూద్దాం ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: