ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు.  ప్రజా తీర్పును ఊహించడం కూడా కష్టమే అవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో.  2018లో జరగిన ఇప్పటి లాగే జరిగిన అయిదు రాష్ట్రాల్లో భారీ ఎదురుదెబ్బే తగిలింది. తెలంగాణలో ఒక స్థానం, మధ్యప్రదేశ్ లో ఓటమి, రాజస్థాన్ లో పరాభవం, ఛత్తీస్ గఢ్ లో ఘోర ఓటమి ఆ పార్టీకి చేదు జ్ఞాపకాలుగా మిగిలాయి.  


అలాంటి దశ నుంచి ఆపార్టీని బలోపేతం చేసి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ సారి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు ఎగ్జిట్ పోల్స్ ఊహకు అందని విధంగా ఛత్తీస్ గఢ్ లో భారీ  విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తెలంగాణలో కూడా ఒక స్థానం నుంచి ఈ సారి ఏకంగా గౌరవ ప్రద స్థానాలకు ఎగబాకింది.


దీంతో ఆ పార్టీ చూపు ఇప్పుడు ఏపీ పై పడింది. ఇప్పడు ఆపార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా డిమాండ్ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో ఆపార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించడంతో పాటు తెలంగాణలో గతంతో పోల్చుకుంటే భారీగానే పుంజుకుంది.  ఇప్పటికే జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో బీజేపీ ఈ కూటమిలో కలిస్తే కచ్ఛితంగా సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది.


ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల ఒప్పందాలు జరగలేదు. టీడీపీ నిర్ణయానికి పవన్ అంగీకరిస్తే ఓకే. లేకుంటే బీజేపీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇద్దిరికీ కలిపి దాదాపు సగం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో గెలిచింది. తెలంగాణలో ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బతినడానికి ప్రధాన కారణం బీజేపీనే.  దాదాపు బీఆర్ఎస్ ఓట్లనే చీల్చినట్లు తెలంగాణ ఫలితాలను చూస్తే అర్థం అవుతుంది. ఎలాగూ వైసీపీ బీజేపీకి అనుకూలంగానే ఉంది. భవిష్యత్తులో ఆశించిన సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీ టీడీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp