
ఏ పార్టీలో అయినా పార్టీ అధినేత ఒక మెట్టు దిగి వస్తే .. కార్యకర్తలు నాయకులు రెండు మెట్లు దిగి వచ్చి అధినేతకు అనుకూలంగా మారతారు. వైసిపి లోను ఇలానే జరిగిందా అంటే ప్రశ్నలు మిగులుతున్నాయి తప్ప ఆన్సర్లు లేవు. జగన్ ఈనెల 1వ తేదీన పార్టీ కార్యకర్తలు , నాయకులతో భేటీ అయ్యారు. మేడే సందర్భంగా వారిని ప్రశంసించారు. పార్టీ బాధ్యతలను ఇక నుంచి మీకే అప్పగించాలని భావిస్తున్నా ? మీరు ఆసక్తి ఉన్నవారు ముందుకు రండి .. జిల్లాలలోనే కాదు మండల స్థాయిలో కూడా పార్టీని ముందుండి నడిపించండి అని బిగ్ ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి వైసీపీలో ఇక్కడ వరకు జగన్ ఇలాంటి ఆఫర్ ఇచ్చింది లేదు .. ఎక్కడ ఏం జరిగినా అంతా తాడేపల్లి కీలక నాయకుల కనుసన్నల్లో నే జరుగుతుంది దీంతో పార్టీలో తమకు స్వేచ్ఛ లేదని పార్టీ నిర్ణయం శిరోధర్యం అవుతుందని నాయకులు .. కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇక జగన్ కూడా కీలక నాయకులకు తప్ప ఎవరికీ చనువు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కొన్ని మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 1వ తేదీన ఆయన నాయకులకు ఇచ్చిన ఆఫర్ తర్వాత పార్టీలో కీలక నేతలకు కీలక పదవులు ఇవ్వాలని భావించారు. వీరిలో మంత్రులు .. ఎమ్మెల్యేలు వారి కుటుంబాలను మినహాయించారు. అయితే ఈ ఆఖరించే పది రోజులు అయిన ఒకరు కూడా ముందుకు రాలేదు. పార్టీ జెండా భుజాన వేసుకుంటామని బాధ్యత తీసుకుంటామని ఒకరు చెప్పటం లేదు. పార్టీలో నాయకులు లేక కాదు .. కార్యకర్తలు లేఖ కాదు కానీ పార్టీని ముందుండి నడిపించే సాహసం ఎవరు చేయలేకపోతున్నారని సీనియర్ నాయకులు వ్యాఖ్యలు ఇస్తున్నారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే తమకు విలువ ఇచ్చే పరిస్థితి ఉండదన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అందుకే ఈ నేపథ్యంలో ఎవరు బాధ్యతలు ? తీసుకున్నందుకు ముందుకు రావడంలేదని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు