
తెలుగుదేశం పార్టీ నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్రలో కడప జిల్లాలో ఎప్పుడు కూడా మహానాడు నిర్వహించలేదు. కడప జిల్లా అంటేనే రాజకీయాలకు సంబంధించినం త వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కాస్త కంచుకోటగా మారింది. జిల్లా రాజకీయల మీద తొలగించి వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టు ... ఆ తర్వాత ఆయన మరణం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పట్టు కొనసాగిస్తూ వచ్చారు. అలాంటిది చంద్రబాబు తొలిసారి కడప గడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. గత రెండు దశాబ్దాల చరిత్ర పరిశీలిస్తే 2004 - 2009 - 2014లో కడప జిల్లాలో పది స్థానాలకు గాను తెలుగుదేశం గెలిచింది ఒక్క సీటు మాత్రమే. ఈ మూడు ఎన్నికల్లో నూ ఒక్కోసారి ఒక్కో చోట తెలుగుదేశం గెలిచేది. ఓ సారి కమలాపురం .. మరోసారి రాజంపేట .. మరోసారి ప్రొద్దుటూరు లో మాత్రమే టీడీపీ గెలిచింది. 2019లో జిల్లాలోని మొత్తం పది స్థానాలను వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. జగన్ ఐదేళ్ల పాలనలో టిడిపి వాళ్ళు తమ బలం పెంచుకోవడానికి ఎప్పుడైనా కష్టం కూడా లేదు. కడప జిల్లాను వదిలేసారు.
కానీ అనూహ్యంగా 2024 ఎన్నికలకు వచ్చేసరికి కడప జిల్లాలో ఎన్డీఏ కూటమి ఏకంగా 10 లో ఏడు సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం ఐదు సీట్లు .. రైల్వే కోడూరులో జనసేన ... జమ్మలమడుగులో బిజెపి గెలిచాయి. తమను అంతగా ఆదరించిన కడప జిల్లాలో మరింత బలంగా బాగా వెయ్యటానికి ఈసారి మహానాడు ఇక్కడ నిర్వహించాలని చంద్రబాబు సంకల్పించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా అంత గొప్పగా పట్టం కట్టిన కడప జిల్లాకు చంద్రబాబు ఏ విధంగా రుణం చెల్లించబోతున్నారు ? ఈ నాలుగేళ్ల పాలనలో ఇక్కడ ఎంత అభివృద్ధి చేస్తారు ? జిల్లా ప్రజల మనస్సులను ఎలా గెలుచు కుంటారు ? అనే దానినిబట్టి ఈ జిల్లాలో కూడా ఆ పార్టీ దృఢంగా పాతుకు పోవటానికి ఇది మంచి అవకాశం అని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు