
రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ విషయంలో దశాబ్దం పైగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఓ స్పష్టమైన ట్రెండ్ ఏమిటంటే కమ్మ వర్గం అంటే టీడీపీ, రెడ్డి వర్గం అంటే వైసీపీ అన్న అభిప్రాయం. దీనికి కొన్ని సార్లు మినహాయింపులు కనిపించినా, ప్రధానంగా ఈ రీతిలోనే రాజకీయ ధోరణులు కొనసాగుతున్నాయి. రెడ్డి వర్గం ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ వైపు టర్న్ అయ్యింది. 2019 ఎన్నికలకు ముందు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ రెడ్డి వర్గం భారీగా కేంద్రీకృతమైంది. కారణాలు ఏవైనా 2024 ఎన్నికలకు వచ్చేసరికి రెడ్లు అందరూ జగన్‌కు దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రెడ్డి వర్గం వైసీపీకి దూరమైన వాస్తవం నిజం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వర్గం నుంచి వైసీపీకి మద్దతుగా ఎలాంటి ఉద్యమం లేకపోవడం, సింపతీ కూడా కరువవడం పార్టీ లోపల తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఈ పరిణామాల మధ్య మద్యం స్కాండల్ కేసులో రెడ్డి వర్గానికి చెందిన ముఖ్య నేతల అరెస్టు మరో కీలక మలుపుగా మారింది. ముఖ్యంగా జగన్‌కు అత్యంత సన్నిహితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి నేతలపై సిట్ అరెస్టులు చేయడం రాజకీయంగానే కాక సామాజికంగాను చర్చనీయాంశమైంది. మిథున్ రెడ్డి అరెస్టు అనంతరం, ఆయన తండ్రి పెద్దిరెడ్డి తన సామాజిక వర్గం ప్రజలను ఐక్యపరచే ప్రయత్నం చేశారు. ఈ కేసు రాజకీయ కుట్రగా జరుగుతోందని ఆరోపిస్తూ రెడ్డి సామాజిక వర్గం ఏకమవ్వాలని ఆయన చేసిన ప్రయత్నాల పట్ల ఆ వర్గంలో ఏ మాత్రం స్పందన లేదని తెలుస్తోంది. ఈ కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని భావించడంతో పాటు అధికారంలో ఉన్నప్పుడు మధ్య తరగతి , దిగువ తరగతి రెడ్డి నాయకులకు పెద్దిరెడ్డి చేసిందేమి లేదన్న భావన కూడా ఈ విషయంలో వారు మౌనంగా ఉండడానికి కారణమైందని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు