గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు రూ.152 పెరిగి రూ.46,557 పలికింది. వెండి కిలో రూ.167 పెరిగి రూ.48,725 వద్ద ఆగిపోయింది. పసిడి ఈ నెల ప్రారంభంలో రూ.45,556 ఉండగా 15వ తేదీన రూ.47360 పెరిగి  స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నిన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నాయి. కానీ అనూహ్యంగా మళ్లి పెరగడం మొదలైంది.  బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి.

 


దేశీయంగా బంగారం కొనుగోళ్లు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.  హైదరాబాద్ మార్కెట్‌లో గత రెండు రోజుల్లో భారీగానే తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.410కు పెరిగింది. దీంతో పసిడి ధర రూ.44,720గా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.700పెరిగి.. దీంతో ధర రూ.48,790కు చేరింది. దీంతో బంగారం ప్రియులకు భారీగానే షాక్ తగిలింది.

 

ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండోరోజులు యథాతథంగా కొనసాగిన బంగారం ధర ఇవాళ కాస్త తగ్గింది.నేడు బంగారం ధరం రూ.100 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,300కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర తగ్గడంతో 10 గ్రాములకు రూ.45,500కి క్షీణించింది.  కాగా, ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.56 శాతం పైకి కదిలింది. దీంతో ధర ఔన్స్‌కు 1728.70 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 17.84 డాలర్లకు క్షీణించింది

మరింత సమాచారం తెలుసుకోండి: