అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది, కేలరీలు అతి తక్కువ, ఒక మంచి ఆహారంగా కూడా పనిచేసి మీరు సన్నగా నాజూకుగా వుండేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది.''   ఇన్ని ప్రయోజనాలున్న ఈ గింజలేమిటో తెలుసా? అదే బార్లీ గింజలు. ఆంధ్రులకు బార్లీ గింజలు కొత్తేమీ కాదు. గతంలో ఇండ్లలో ఒక్కరోజు జ్వరం పడితగ్గితే చాలు బార్లీ జావలు కాచి ఇచ్చేవారు. అద్భుతమైన ఈ గింజలో నీటిలో కరగని పీచు వుండి శరీరంలో నీటిని నిలిపివుంచుతుంది. పేగులలో వుండే మలినాలను వేగంగా బయటకు పంపేస్తుంది. బార్లీ ఒక రకము గడ్డి జాతి పంట . బార్లీ గింజలు ఆహారము గాను , ఔషదము గానూ ఉపయోగపడుతుంది . బార్లీలో శక్తి మధ్యస్తంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా మధ్యస్తంగా ఉంటాయి. కొవ్వు తక్కువ. సంతృప్త కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ కనుక అరుగుదలకు మంచిది.

 
 

ఒక కప్పు ఉడికించిన బార్లీలో 4.5 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అలాగే 12.5 మిల్లీగ్రాముల ఫోలేట్ ఉంటుంది. ఇది పెద్దలకు రోజుకు అవసరమైన ఫోలేట్ మోతాదులో 3 శాతం. బార్లీలో సోడియం తక్కువ కనుక రక్తపోటు భయం ఉండదు. బార్లీలో బి-విటమిన్లు, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లోహం, పొటాషియం వంటి ఖనిజ సంపద పదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే బార్లీలో లైసిన్ అనే ఎమైనో యాసిడ్ ఉండదు.

 

కేన్సర్ అరికడుతుంది. మలబద్ధకం రాకుండా కూడా బార్లీ జావ తాగుతారు. బార్లీ నీరు కిడ్నీలకు ఒక వరంగా భావించాలి. కీళ్ళనొప్పులు, వంటి నొప్పుల సమస్యలను మాయం చేస్తుంది.  దీనిని ఎలా తయారు చేయాలి? బార్లీ గింజలను మెత్తగా నీటిలో ఉడికించండి. వడగట్టండి. కొంచెం రుచిగా వుండటానికిగాను వడకట్టిన నీటిలో ఆరెంజ్ జ్యూస్ లేదా నిమ్మరసం కలపండి. అంతే మీ బార్లీ నీరు తయారైనట్లే. దీనిని ఫ్రిజ్ లో లేదా చల్లని ప్రదేశంలో వుంచితే, పోషకాలు పోకుండా వుంటాయి. ఇంత అధ్భుతమైన బార్లీ గింజలను, ప్రతిరోజూ మనం తినే సూప్ సలాడ్, సిరియల్ వంటి వాటిలో కూడా వేసుకొని ప్రయోజనం పొందవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: