ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ ప్రపంచంలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతూ వుంటారు. దానికి ఆహరపూటలవాట్లు కూడా ప్రధాన కారణమే. మనం తీసుకునే ఆహరం కూడా మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. ఆహారం రుచిగా ఉండడానికి మసాలాలు వాడతాం. ఒక్కో మసాలాదీ ఒక్కొక్క రుచి. అయితే ఈ మసాలాలు కేవలం రుచి కోసమే కాదు ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడటానికి కూడా పనికొస్తాయి. అయితే ఏ మసాలాల్ని మీ డైట్ లో భాగం చేసుకుంటే కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయడం, మ్యానేజ్ చేయడం తేలికవుతుందో చూడండి.

బిర్యానీ, చికెన్ కర్రీ వంటివి దాల్చిన చెక్క లేకుండా చేయలేము. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుండి మనని ప్రొటెక్ట్ చేస్తాయి. గుండె కి సంబంధిన వ్యాధులు రాకుండా కూడా ఈ గుణాలు కాపాడగలవు.చిల్లీ పెప్పర్స్ ఫుడ్ కి మంచి ఫ్లేవర్ ని ఇవ్వడమే కాదు విటమిన్ సీ ని కూడా అందిస్తాయి. విటమిన్ సీ ఇమ్యూనిటీ ని బూస్ట్ చేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే ఇతర సుగుణాలు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.సెలరీ సీడ్స్ ని మెడిటరేనియన్ రీజియన్ లో ఎక్కువగా వాడతారు. వీటిని సాధారణంగా హెర్బల్ టీ ప్రిపేర్ చేయడం లో ఉపయోగిస్తారు. సెలరీ సీడ్స్ ఇన్‌ఫ్లమేషన్ తో, హై బ్లడ్ ప్రెషర్ తో పోరాడగలవు అని చెబుతారు.

అల్లం లో జింజరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ నొప్పిని తగ్గిస్తుంది, సెడెటివ్ గా పని చేస్తుంది, యాంటీ పైరటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అంతే కాక ఈ కాంపౌండ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొన్ని పరిశోధనల వల్ల అల్లం తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందనీ ఫలితంగా హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుందనీ తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: