చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను విషపు పాములా కాటేస్తుంది.ఇక సెకండ్ వేవ్ అయితే మరింత దారుణంగా విజ్రుంభిస్తుంది.మొదటి దశ కంటే ఈ రెండవ దశ ఇంకా చాలా దారుణంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ఇండియాలో కూడా రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.చాపకింద నీరు లాగా కేసులు రోజు రోజుకి నలుమూలాల వ్యాపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు టీకాలు చాలా అవసరం.ఇక ఆ టీకాలు తయారు చేసే సంస్థలు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.ఈ వ్యాక్సిన్ తయారీ సంస్థలు ప్రపంచ మానవులకు రక్షకులుగా వున్నారు.అయితే వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకాకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది.అదేంటంటే 27 దేశాలకు సంబంధించిన యూరోపియన్ కూటమి ఆస్ట్రాజెనికా సంస్థతో ఎన్ని టీకాలు కావాలో ఒప్పందం కుదుర్చుకుంది.అయితే ఆ టీకాలు ఇప్పటిదాకా పంపిణీ చెయ్యలేదు.అయితే ఇంగ్లాండ్ ముందు తమ దేశ అవసరాలు తీర్చి టీకాలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది.ఆ ప్రకారంగానే ఆస్ట్రాజెనెకా సంస్థ ముందు ఇంగ్లాండ్ కి టీకాలకు ఇవ్వాలని సిద్ధమయ్యింది.


దాంతో ఆస్ట్రాజెనెకా మొదట తయారవుతున్న వ్యాక్సిన్ లు ఇంగ్లాండ్ కే ఇస్తుంది.అయితే ఇదే ఇప్పుడు ఈ సంస్థకి పెద్ద సమస్యగా మారింది. ఆస్ట్రాజెనెకా చేసిన ఈ పనికి యూరోపియన్ యూనియన్ ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా వుంది.కమిషన్ సంస్థపై బెల్జియన్ కోర్టులో రెండు అత్యవసర చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. 27 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల మద్దతుతో యూరోపియన్ కమిషన్, ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 300 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను యూరోపియన్ యూనియన్ కి పంపిణీ చేయాలనే నిబంధనతో ఆస్ట్రాజెనెకా ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వాదించడం జరిగింది.దీన్ని బట్టి చూస్తుంటే టీకాల సంస్థలకి ఇదొక పెను వివాదంగా మారే అవకాశం వున్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.ఏది ఏమైనా అన్ని దేశాలకు సమంగా టీకాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఆస్ట్రాజెనెకా ఇలా చెయ్యటం తప్పే కదా..

మరింత సమాచారం తెలుసుకోండి: