మానవుని శరీరంలో ఆక్సిజన్ కొరతను కనిపెట్టడానికి "పల్స్ ఆక్సీమీటర్ " సహాయంతో తెలుసుకోవచ్చు. ఆక్సీమీటర్ మన చేతి వేలికి పెట్టుకుంటే చాలు, అది మన శరీరంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో తెలియజేస్తుంది. మానవుని శరీరంలోని 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే, మనం వెంటనే వైద్యుని సంప్రదించాలి. ముఖ్యంగా కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రం రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఆక్సీ మీటర్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఆక్సిజన్ 94 % కంటే తక్కువ గా కనిపిస్తే మీకు ఆక్సిజన్ ఎంతో అవసరమని అర్థం. సమయానికి మీరు ఆక్సిజన్ అందుకోగలిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు.  శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనకు ఛాతి నొప్పి, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు.


ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనిషికి ఆక్సిజన్ చాలా అవసరం. ఆక్సిజన్ అందక పోతే ఏంచేయాలి అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రోనింగ్ అంటే ఒక వ్యాయామం. ఈ వ్యాయామం తో ఈ సమస్యకు పరిష్కారం పొందవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రోనింగ్ చేయడం వలన శరీరం లో ఆక్సిజన్ స్థాయిని అమాంతం పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు  వైద్యులు.

అసలు ప్రోనింగ్ అంటే ఏంటి?  ఎలా చేయాలి? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం. ఛాతి, పొట్ట భాగంలో బరువు పడే విధంగా బోర్లా తిరిగి పడుకోవడం,  లేదంటే ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది. ఈ పద్ధతిని ప్రోనింగ్ అని అంటారు. ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ కి  ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అని వైద్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి మీలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పెరగాలంటే ఈ ప్రోనింగ్ వ్యాయామాన్ని ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకుంటూ నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కరోనాను తరిమికొడదాం నిత్యం ఆరోగ్యంగా జీవిద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: