కరివేపాకు వంటలలో రుచికి మాత్రమే కాకుండా సువాసన కూడా అందిస్తుంది. ఈ ఆకులను దక్షిణాది భారత వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలామంది ఇంట్లో కూడా కరివేపాకు మొక్క లను పెంచుకుంటూ ఉంటారు ఇటువంటి పరిస్థితులలో అవసరమైనప్పుడు తాజా కరివేపాకు ఉంటారు ఉపయోగించు కుంటూ ఉంటారు . అయితే కరివేపాకు ఆహారానికే కాకుండా రుచి వాసన , ఆరోగ్య పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల లో ఎక్కువగా క్యాల్షియం రాగి మెగ్నీషియం పాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజూ రెండు లేదా మూడు ఆకులను పరగడుపున నమిలి తిన్నట్లయితే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయట వాటి గురించి చూద్దాం.

1). ప్రతిరోజు కరివేపాకు ను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది. కొంతమంది వైద్యులు తెలిపిన ప్రకారం ఈ ఆకులు  హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి చక్కెర స్థాయిని నియంత్రిస్తాయట.

2). ప్రతిరోజు ఉదయం కరివేపాకు ఆకులను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.. అంతేకాకుండా  జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

3). కరివేపాకు కూడా బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను కూడా బయటికి పంపించి బరువు తగ్గేలా చేస్తుంది.

4). కరివేపాకు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది ఈ ఆకులను ఖాళీ కడుపుతోనే తీసుకుంటే చాలా మంచిదట.

5). ఖాళీ కడుపుతో కరివేపాకు ఆకులను తింటే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆకులు కాలేయం పనితీరును కూడా బాగా మెరుగు పడేలా చేస్తాయి అందువల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని ఉదయం పరగడుపున తినడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: