
నీరు :
డెలివరీ తర్వాత నీరు అధికంగా ఇవ్వడం వల్ల,పొట్ట పడుతుందని బాలింతలకు నీరు ఇవ్వరు.కానీ ఇది అపోహ మాత్రమే.పాలిచ్చే తల్లులకు అధిక నీరు ఇవ్వడం వలన వారు డిహైడ్రేషన్ కాకుండా కాపాడుతాయి.మరియు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
కాల్షియం అధికంగా ఆహారాలు..
కాల్షియం అధికంగా ఉన్న పాలు,పాల ఉత్పత్తులు, గుడ్లు క్యారెట్ వంటి ఆహారాలను ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలవృద్ది జరిగి పిల్లలకు తగిన పాలు లభిస్తాయి. తల్లిపాలు పిల్లల మెదడు పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ప్రోటీన్ ఆహారాలు :
ప్రోటీన్ అధికంగా ఉన్న పుట్టగొడుగులు, మాంసం వంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల,తల్లి పాలలో పిల్లలు కావాల్సిన విధంగా ప్రోటీన్ మారి, పిల్లల కందడం వల్ల వారి పెరుగుదలకు తోడ్పడతాయి.
మొలకలు..
చిరుధాన్యాలను మొలకలు కట్టి, క్యారెట్ వంటివి కలిపి ఇవ్వడం వల్ల తల్లుల్లో పాల వృద్ధి జరుగుతుంది. వీటి వల్ల పిల్లలకు జీర్ణక్రియా శక్తి పెరుగుతుంది.
వెల్లుల్లి :
పూర్వం నుంచి మన పెద్దలు తల్లుల్లో పాలు పెరగడానికి వెల్లుల్లిని పత్యం రూపంలో ఇస్తుంటారు. దీనివల్ల తల్లుల్లో పాలు పెరగడమే కాకుండా, వాతం పిత్తం దోషాలు తొలుగుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెరిగి,సీజనల్ గా వచ్చే జలుబులు, దగ్గులకు దూరంగా ఉండవచ్చు.