మనందరికీ తెలిసిందే, రక్తం బాగా పెరగాలి అంటే డాక్టర్లు ఎక్కువగా సజెస్ట్ చేసేది ఆపిల్, దానిమ్మ. . ముఖ్యంగా దానిమ్మ గింజలను నేరుగా తిన్నా లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా రక్తం పెరుగుతుందని, అది ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి డాక్టర్ చెబుతూనే ఉంటారు. ఆ కారణంగానే ఎవరికైనా నీరసం, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు, చిన్నపిల్లలు ఉన్నప్పుడల్లా గుర్తొచ్చేది ముందుగా దానిమ్మ పండే. దానిమ్మ పండులో దివ్య ఔషధ గుణాలు ఉంటాయి. దానిమ్మ గింజలు తిన్నా, జ్యూస్ తాగినా అనేక వ్యాధులను నివారించవచ్చని వైద్యులు చెబుతారు. అయితే ఏ సమయంలోనైనా తాగితే సరిపోదు. సరైన సమయాన్ని పాటించకపోతే కొన్ని ఇబ్బందులు రావచ్చు. మరి దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల లాభాలు ఏమిటి?.. ఏ పద్ధతిలో, ఏ సమయంలో తీసుకోవాలి?..తప్పుగా తీసుకుంటే ఏమవుతుంది? అనేటివి ఇప్పుడు ఇక్కడ చదివి  తెలుసుకుందాం.


దానిమ్మలో ఉన్న పోషకాలు:

దానిమ్మలో విటమిన్ ఛ్, విటమిన్ ఖ్, పొటాషియం, పాలీఫెనాల్స్, ఎలాజిక్ ఆమ్లం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. రోజుకు ఒక్క దానిమ్మ పండు తిన్నా లేదా జ్యూస్ తాగినా ఈ పోషకాలు శరీరానికి అందుతాయి.

ఎప్పుడు దానిమ్మ జ్యూస్ తాగాలి?

డాక్టర్ల సజెస్ట్ చేస్తున్న ప్రకారం సాయంత్రం తర్వాత దానిమ్మ తినకపోవడం మంచిది. దానిమ్మలో జలుబు, దగ్గు పెంచే ప్రేరకాలు ఉండటం వల్ల రాత్రివేళల్లో తీసుకుంటే జలుబు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు సాయంత్రం తర్వాత దానిమ్మ జ్యూస్ తాగకపోవడమె మంచిది అంటున్నారు జనాలు.

దానిమ్మ జ్యూస్ తాగడానికి సరైన సమయం:

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో దానిమ్మ జ్యూస్ తాగడం ఉత్తమం. ఉదయం నుంచి సాయంత్రం వరకు శరీరం పని చేయడానికి అవసరమైన ఎనర్జీ దానివల్ల లభిస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా దానిమ్మ జ్యూస్ తీసుకోవచ్చు.

దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల  ప్రయోజనాలు:

*హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

*రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

*గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

*బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

*రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

*చర్మానికి సహజమైన మెరుపు ఇస్తుంది.

*కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: