చైనా ఈ మ‌ధ్యన ట్రెండింగ్ లో ఉన్న ప‌దం చికెన్ బ్ల‌డ్ పేరెంటింగ్. దీని కోసం చైనా లో ఉన్న త‌ల్లిదండ్ర‌లు అంద‌రూ ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఏకంగా తమ ఉద్యోగాల‌ను కొన్ని రోజులు సెల‌వులు పెడుతున్నారు. అంత‌గా ఈ చికెన్ బ్ల‌డ్ పేరెంటింగ్ ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. కానీ ఈ చికెన్ బ్ల‌డ్ పేరెంటింగ్ పై వైద్య నిపుణులు అసహ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వారు చెబుతున్నారు. చికెన్ బ్ల‌డ్ పేరెంటింగ్ అంటే చైనా లోని పిల్ల‌ల‌కు ఎలాంటి ప్ర‌త్యేక మైన క‌ళ ఉందో త‌ల్లిదండ్రులు తెలుసుకోవాడం. అంటే పిల్ల‌ల లో క‌ళ‌ను వెలికి తీసేది మంచిదే క‌దా ప్ర‌మాదం ఎలా ఉంటుంది అంటే.. ఈ ప‌ద్ద‌తి ప్ర‌కారం గంట‌ల త‌ర‌బ‌డి విద్యార్థుల‌ను ఒకే ప‌ని చేయిస్తారు. పిల్ల‌ల‌ను ఒకే గ‌దిలో బందించ‌డం, పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టించ‌డం లాంటివి ఉంటాయి. ఇవి ఇలానే చేస్తే భవిష్య‌త్తులో పిల్లల‌కు తీవ్ర దుష్ప్ర‌లితాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

నేటి స‌మాజంలో త‌మ పిల్ల‌ల‌ను ఒక ప్ర‌త్యేక రంగంలో ఉంచాల‌ని పేరెంట్స్ అనుకుంటారు. దానికి అనుగూణంగా త‌మ పిల్ల‌ల‌ను పెంచుతారు. దానితో పాటు ఆరోగ్య క‌ర‌మైన ఆహారం, ఆట‌లు ఉండేవి. కానీ నేడు చైనాలో అనుస‌రిస్తున్న ఈ విధానం ద్వారా పిల్ల‌ల‌ను రోజుకు 14 గంట‌లు ఒక అంశం పై శిక్ష‌ణ ఇస్తారు. అలాగే త‌ల్లిదండ్రులు త‌మ ఉద్యోగాల‌కు సెల‌వు పెడుతారు. స్కూల్స్ కు ద‌గ్గ‌రలోనే ఇల్లును అద్దే కు తీసుకుంటారు. ఈ స‌మ‌యంలో పిల్ల‌ల‌ను ఒకే గ‌దిలో ఉంచి పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టిస్తారు. ఇలా చేయ‌డం పిల్ల‌ల‌కు కంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు 81 శాతం మంది పిల్ల‌ల‌కు కంటి కి సంబంధించిన వ్యాధులు వ‌చ్చాయ‌ని చైనాలోని నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. ఈ విధానం ఇలాగే కొన‌సాగుతే పిల్ల‌లు త‌మ కంటి చూపును పూర్తిగా కొల్ప‌యే ప్ర‌మాదం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: