ఈ భూమి మీద రేయి పగలు, వెలుగు నీడలు ఎంత సహజమో.. జీవితంలో కష్టం సుఖం కూడ అంతే సహజం. అయితే కష్టంలో ఉన్నవాడికి ఈ ప్రపంచ జ్ఞానం పట్టదు. అతని మనసంతా ఆ కష్టం మీదనే ఉంటుంది. ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలా అన్న ఆత్రుతే ఉంటుంది.

 

 

అందుకే ఈ కష్టానికి తోడు మరో కష్టం వస్తే తట్టుకోలేదు.. దేవుడా ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయని ఫీలవుతాడు.. తాను కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారేనంటని మథనపడతారు. అలాంటి వాళ్లు కాస్త ఆ కష్టం నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. అప్పుడు కాస్త సాంత్వన దొరుకుంది.

 

 

మరోవిషయం ఏంటంటే.. కష్టాలే మనిషిని రాటుదేలుస్తాయి. గాలివాన చెట్టును ఎంతగా ఊపితే, దాని వేళ్లు అంతగా గట్టిపడతాయి. జీవితంలో కష్టాలు, ఆటుపోట్లు ఎంత ఎక్కువైతే మనిషిలో అంత సహనం, పట్టుదల పెరుగుతాయి. మొక్క దృఢంగా ఎదిగిందంటే, అది ఎన్నో గాలివానల్ని తట్టుకుందని అర్థం.

 

మీకు కష్టాలు వరుసగా వస్తున్నాయంటే.. అది మీ స్టామినాకు పరీక్ష అని అర్థం.. కష్టాలకు తలవంచక ధైర్యంగా పోరాడితే మీరు విజేతగా నిలుస్తారు. అసలు మనిషి మహావిజేతగా నిలిచాడంటే అతడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడని కదా. అందుకే ఈ ప్రకృతే మీకు స్ఫూర్తి ప్రదాత.

 

మరింత సమాచారం తెలుసుకోండి: