ఆముదం చెట్టు గింజల నుండి తీసే  ఆముదం నూనె ఎన్నో ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను, పోషకాలను కలిగి ఉంది. ఆముదం నూనెలో రిసినోలియెక్ ఆమ్లం, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ ఇంకా అలాగే మినరల్స్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.గుండె జబ్బులు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, దురద, వాపు, నొప్పులు, విష జ్వరాలు, నులిపురుగులు, మలబద్దకం ఇలా చాలా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఆముదం నూనె మనకు దోహదపడుతుంది. ఆముదం నూనె వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. ఇంకా దీనిని ఎలా ఉపయోగించాలి..వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం నూనెను వాడడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇన్ ప్లామేషన్ ను తగ్గించి నొప్పులను తగ్గించడంలో ఆముదం నూనె సహాయపడుతుంది. దీని కోసం ఒక మెత్తటి వస్త్రాన్ని తీసుకొని దానిని ఆముదం నూనెలో ముంచి నొప్పులు ఉన్న గట్టిగా కట్టాలి.ఆ తరువాత దీనిపై వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పులు ఈజీగా తగ్గిపోతాయి. ఆముదాన్ని వాడడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది.


మనం తీసుకునే ఆహారంలో  ఆముదాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్ ఇంకా నులిపురుగులు వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట మొత్తం కూడా శుభ్రపడుతుంది. ఇంకా అలాగే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఆముదం సహాయపడుతుంది. ఈ ఆముదంలో అన్ డీసైక్లీనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తామర, దురద వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఆముదం నూనెను తీసుకుని తరువాత దానికి సమానంగా కొబ్బరి నూనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను చర్మసమస్యలు ఉన్న చోట తరుచూ రాయడం వల్ల ఖచ్చితంగా చక్కటి ఉపశమనం కలుగుతుంది.ఇంకా అదే విధంగా ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో 2 టీ స్పూన్ల ఆముదం కలిపి పరగడుపున తాగాలి.ఇక దీనిని తాగిన అరగంట తరువాత ఒక గ్లాస్ నీటిని తాగాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ ఇంకా మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: