దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇంకా బోధకాలు వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ విష జ్వరాల వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మనం వీలైనంత వరకు దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలి. మన ఇంట్లో, మన ఇంటి పరిసరాల్లో ఖచ్చితంగా దోమలు లేకుండా చూసుకోవాలి. చాలా మంది కూడా దోమల బెదడను తగ్గించుకోవడానికి దోమల బ్యాట్ లను, స్ప్రేలను ఇంకా కాయిల్స్ వంటి వాటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం మాత్రం అంత మంచిది కాదు.అందుకే వీటికి బదులుగా కొన్ని సహజ సిద్ద పదార్థాలను ఉపయోగించి కూడా మనం చాలా సులభంగా దోమల బెడద నుండి బయటపడవచ్చు. దోమలను నివారించడంలో వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ వెల్లుల్లిని పొడిగా చేసి నీటిలో కలిపి ఇంట్లో, దోమలు ఎక్కువగా తిరిగే చోట ఇంకా ఇంటి చుట్టు స్ప్రే చేయాలి. ఇలా చయడం వల్ల దోమల బెడద ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే వేప ఆకులను ఉపయోగించి కూడా డెంగ్యూను వ్యాప్తి చేసే దోమలను నివారించవచ్చు.


వేప ఆకుల పొడిని నీటిలో కలిపి ఇంట్లో ఇంకా ఇంటి చుట్టూ స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే లెమన్ గ్రాస్ ఆయిల్ నుండి వచ్చే వాసన కూడా దోమలకు నచ్చదు.ఇంకా ఈ ఆయిల్ ను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ వాసన కారణంగా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.ఇంకా అదే విధంగా మన ఇంట్లో ఉండే కర్పూరం వాసన కూడా దోమలకు నచ్చదు. దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇంకా అలాగే ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్లలను ఉంచడం లేదా కర్పూరాన్ని పొడిగా చేసి చల్లడం వంటివి చేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. అలాగే పెప్పర్ మెంట్ ఆయిల్ నుండి వచ్చే వాసన కూడా దోమలకు నచ్చదు. కాబట్టి ఈ ఆయిల్ ను కొన్ని చుక్కల మోతాదులో నీటిలో కలిపి ఇంట్లో, దోమలు ఎక్కువగా ఉండే స్ప్రే చేసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: