సాధారణంగా చలికాలం రాగానే మార్కెట్లో చిలుకదుంపలు తెగదు లభిస్తూ ఉంటాయి.చాలా ఏరియాలో ఈ చిలకడ దుంపలను గంజి గడ్డలని అంటూ ఉంటారు.ఈ గంజి గడ్డలను చాలామంది సాధారణ పొటాటోలో తిన్నంత ఇష్టంగా వీటిని తినరు.అలాంటి వారికి ఎన్నో పోషకాలు మిస్ అయినట్టేనని,వీటిని తినడంతోనే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా సమకూర్తాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.అవేంటో మనము తెలుసుకుందామా..

మొత్తానికి చిలగడం దుంపలో ఐరన్,ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది.దీంతో అనీమియా సమస్య ఉండదు.రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప ఉండేలా చూసుకోవాలి.మరీ ముఖ్యంగా ఎముకలు బలహీనంగా ఉండేవారు అంటే పిల్లలు మరియు వయసు మళ్లీన వారు చిలగడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

మరియు చిలకడ దుంపలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల తొందరగా పొట్ట నిండిన భావన కలుగుతుంది.దీనితో ఎక్కువ తినాలనే కోరిక తగ్గిపోతుంది.ఎవరైతే తొందరగా బరువు తగ్గాలని కోరుకుంటూ ఉంటారో,వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువ.


చిలగడదుంపలో ఉన్న కెరటనాయిడ్స్ రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది.మధుమేహంతో బాధపడేవారు చిలగడదుంపను ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు.దీంతో పాటు ఇందులో ఉండే పోషకాలు వారికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి.

ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది.ఈ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది కనుక కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.అంతే కాక ఇందులో ఉన్న విటమిన్ సి జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరియు అధిక బీపితో బాధపడేవారు చిలగడ దుంపను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి పనితీరును మెరుగుపరచి,బిపిని కంట్రోల్ లో ఉంచుతుంది.మరియు కీళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

చాలామంది చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని, ఆవిరితో ఊడికించి తింటారు.కాబట్టి ఇందులో ఆయిల్ వాడకం అవసరం ఉండదు కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మేలు సమాకూరుతుంది.

కావున ఇన్ని ప్రయోజనాలు కలిగిన చిలకడ దుంపను రోజువారి ఆహారంలో తప్పక చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: