చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ బరువు అనేది అసలు తగ్గరు. బరువు తగ్గడానికి ఈ ఆహారాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్లు, కఠోరమైన వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వడానికి తినకుండా ఆకలితో అలమటించే వారిని కూడా మనం చూస్తుంటాం. కానీ ఏమాత్రం బరువు తగ్గారు. 

రోజువారి అలవాట్లలో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి, రోజువారి అలవాట్లలో పాటించాల్సిన కొన్ని విషయాలు ఏమిటో చూద్దాం. పాలకూర, కాలే, కోల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ ఆకు కూరల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని తింటే ఆకలి తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతారు. బీన్స్, చిక్ పీస్ చిక్కుళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కడుపు నిండిన ఫీల్ కలుగుతుంది. బీన్స్ తింటే జీర్ణ సమస్యలు రావు.

 బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. గుడ్లు, చేపలు, చికెన్ లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కణజాలాలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఆకలి నీ కంట్రోల్ చేస్తుంది. లీన్ ప్రోటీన్ తింటే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గొచ్చు. ఓట్స్ , బ్రౌన్ రైస్, క్వీనోవా వంటి వాటితో తయారుచేసిన ఆహారాలు తింటే బరువు తగ్గడానికి వీలవుతుంది. వీటిలోని ఫైబర్ కడుపు నిండిన ఫీల్ అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బాదం, వాల్ నట్స్, చియా సీడ్స్, అవిస గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆహారాలు తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: