చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు . కనీసం డాక్టర్ వద్ద చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు.  మరి ముఖ్యంగా కొంతమంది చదువుకొని మంచి మంచి జాబ్ చేస్తూ లక్షలకి లక్షలు సంపాదిస్తున్న వారు కూడా తమ పర్సనల్ ప్రాబ్లమ్ డాక్టర్స్ కి చెప్పుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు.  మరీ ముఖ్యంగా కొంతమందికి అన్నం తిన్న తర్వాత వెంటనే బాత్రూం కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది . అది చాలా చాలా నార్మల్ అని అంతా అనుకుంటూ ఉంటారు.  కానీ అలా అనుకుంటే పొరపాటే . కడుపు నిండినప్పుడు పెద్ద ప్రేగులల్లో కదలికలు ఉత్తేజితమవుతాయి.


దానివల్ల కడుపునిండా భోజనం చేసినప్పుడు 15 నిమిషాలలోనే టాయిలెట్ కి వెళ్లవలసిన అవసరం ఏర్పడవచ్చు.  అయితే కడుపు గోడలలోని రిసెప్టర్లు దాని పరిణామం పెరగడానికి గుర్తిస్తాయి . అంతేకాదు ఇది ఆటోనామిక్ నాడి వ్యవస్థ ద్వారా సంకేతాలను పంపి తద్వారా పెద్ద ప్రేగులో సంకోచాలను కలిగిస్తుంది అంటున్నారు డాక్టర్లు . ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను వేగవంతం చేసి మలవిసర్జనలను ఉత్తేజితం చేస్తాయి అంటున్నారు డాక్టర్లు. భోజనం తర్వాత నిర్దిష్ట సమయంలో జీర్ణక్రియ చురుకుగా ఉండడం వల్ల టాయిలెట్ ట్రిప్స్ సాధారణం కావచ్చు . అయితే కొందరిలో మాత్రం ఇది మరింత ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు.  ఈ లక్షణాలు తరచూ లేదా తీవ్రంగా ఉంటే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది అంటూ సూచిస్తున్నారు .



మరీ ముఖ్యంగా 35 నుండి  50 సంవత్సరాల వయసులోపు వాళ్ళు ఇలా తిన్న వెంటనే ఒకటి లేదా రెండు సార్లు బాత్రూం కి వెళ్లవలసి వస్తే అది పెద్ద ప్రమాదకరం కాదు అని దానికంటే ఎక్కువగా నాలుగు ఐదు సార్లు బాత్రూంకి వెళ్ళవలసి వస్తూ ఉంటే అది కూడా ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉంటే కచ్చితంగా డాక్టర్ దగ్గర చూయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు . ఇక 50 నుంచి 60 వయసులోపు వాళ్లకి ఇలాంటి ప్రాబ్లం కామన్ గానే కనిపిస్తూ ఉంటుందట.  కానీ కొందరికి మాత్రం ఇలా అవ్వడం మరింత డేంజర్ అంటున్నారు నిపుణులు.  అందుకే ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కడుపు నొప్పి వస్తూ బాత్రూం కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మరింత ముఖ్యమంటున్నారు . ఇవి అనేక జబ్బులకు దారి తీసే మొదటి లక్షణాలు గా కూడా చెప్పుకొస్తున్నారు . ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే ఏం మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే . మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే సొంత చిట్కాలు పాటించకుండా వెంటనే మీకు దగ్గరగా ఉన్న డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం అని పాఠకులు గుర్తుంచుకోండి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: