ఈమధ్య కాలంలో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో నెల తిరిగేసరికి ఒక రూపాయి కూడా చేతిలో మిగలడం లేదు. ముఖ్యంగా మనుషులు పేదవారిగా మిగలడానికి డబ్బు రాకపోవడం ఒక్కటే కారణం కాదు.. మనసు కూడా మంచిగా ఉండడంతోపాటు మంచి అలవాట్లు కూడా ఉండాలి. అప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. ఇకపోతే మన ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటి పైన లేనట్టే అని గ్రహించాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలో కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.


ముఖ్యంగా సంపద అనేది మన ఇంటి పరిశుభ్రత పైన కూడా ఆధారపడి ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి కూడా సంతోషంగా మన ఇంటికి ఆహ్వానించబడుతుంది.. ఒకవేళ మీ ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే కచ్చితంగా మీ ఇంట్లో ధనలక్ష్మి అయితే ఉండదు అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈశాన్య దిశ అపరిశుభ్రంగా ఉంటే అసలు మంచిది కాదట.  ప్రతిరోజు మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి.. మురికిగా చెత్తాచెదారంతో ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇక అంతేకాదు చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టి చీపురును కూడా లక్ష్మీదేవితో సమానంగా పూజించాలి.


ఇక డబ్బులు,  నగలు ఉంచే అల్మరా వద్ద చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకండి. ఇది మీ ఆదాయంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక అంతేకాదు పర్సులో ఉండే డబ్బు కూడా నీళ్లలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. అందుకే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇకపోతే ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా గౌరవించాలి. పెద్దలను గౌరవించని వారు కీర్తి ,బలం, వయస్సు జ్ఞానం అన్ని కోల్పోతారు. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుందట  ఇక ఇంట్లో ఆడవారు కంటతడి పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఆడవారు కంటతడి పెడతారో అప్పుడు ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: