శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ‘శ్రీకారం’ మూవీ ఫ్లాప్ అవ్వడమే కాకుండా ఈమధ్య ఈమూవీ నిర్మాతలతో అతడికి వచ్చిన భేదాభిప్రాయాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి శర్వానంద్ కు ఇండస్ట్రీ వర్గాలలో చాల మంచి పేరుంది. సౌమ్యుడుగా పేరుగాంచిన శర్వానంద్ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలోను తల దూర్చలేదు.


అయితే ‘శ్రీకారం’ మూవీ నిర్మాతలు తనకు పారితోషికంలో కొంత భాగం క్లియర్ చేయలేదు అంటూ శర్వానంద్ లీగల్ నోటీసులు ఇచ్చాడు అన్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతూ శర్వానంద్ తప్పు చేసాడా అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. వాస్తవానికి ‘శ్రీకారం’ మూవీని నిర్మించిన 14 రీల్స్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ అని అలాంటి సంస్థ పారితోషిక విషయంలో కొద్ది ఆలస్యం చేయవచ్చు కానీ తేడరాదు అన్నవిషయం శర్వానంద్ ఎందుకు గుర్తించలేకపోయాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


వాస్తవానికి ‘శ్రీకారం’ మూవీ ఫ్లాప్ గా మారడంతో ఆమూవీ నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చిన విషయం ఓపెన్ సీక్రెట్ అని అంటూ ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల సరిగ్గా వ్యాపారాలు లేక అందరు తమతమ స్థాయిలలో ఇబ్బంది పడుతున్న నేపధ్యం శర్వానంద్ కు తెలియదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు శర్వానంద్ నిర్మించిన ‘కో అంటే కోటి’ సినిమాకు సహ నిర్మాతలుగా కూడ వ్యవహరించి నష్టపోయిన వీరిపట్ల శర్వానంద్ కు అభిమానం లేదా అంటు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు శర్వానంద్ 14 రీల్స్ నిర్మాతలతో ప్రవర్తించిన తీరు పై కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం గతః కొన్ని సంవత్సరాలుగా శర్వా కెరియర్ ఏమాత్రం బాగుండటం లేదు. వరసపెట్టి వస్తున్న పరాజయాలతో శర్వానంద్ సినిమాల మార్కెట్ కూడ బాగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితులలో ‘శ్రీకారం’ ఫెయిల్ అవ్వడం ఒక షాక్ అనుకుంటే ఆ మూవీ నిర్మాతలతో ఈ యంగ్ హీరోకు ఏర్పడ్డ భేదాభిప్రాయాలు అతడి కెరియర్ పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: