తెలుగు బిగ్ బాస్ అన్ని టెలివిజన్ షో లకంటే మంచి రేటింగ్ ని కలిగి ఉంది. రోజురోజుకి బిగ్ బాస్ హౌస్ లో ఏమ్ జరగబోతుందని ఉచ్ఛుకత ప్రేక్షకుల్లో నెలకొంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో ని అగ్రస్థానం లో నిలబెట్టాడు. తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది వారలు పూర్తి చేసుకుంది. హౌస్ లోకి 19 మంది హౌస్ లోకి వెళ్లగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు  , వారిలో సరయు , ఉమాదేవి , లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ , ప్రియా  లతోపాటు ఎనిమిదవ వరం లో లోబో అనూహ్యంగా ఇంటినుండి బయటకు వచ్చాడు.




లోబో ఇంటినుండి బయటకు రావడం ఇది రెండవసారి అయినప్పటికీ మొదటి సారి ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడు కానీ ఈ వారం మాత్రం ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేక పోయాడు. అయితే ఎనిమిదవ వారం లో రవి , షణ్ముఖ్ , సిరి , జస్వంత్ , మానస్ , శ్రీరామచంద్ర, లోబో లు ఉన్నారు. అయితే ఇంటి సబ్యులకు పోలైన ఓట్లు చూసుకున్నట్లైతే. చివరి రెండు స్థానాల్లో లోబో మరియు సిరి ఇద్దరు పోటీ పడ్డారు. అయితే లోబో కి అతి తక్కువగా ఓట్లు పోల్ అవ్వడంతో లోబో ఎలిమినేట్ అయ్యాడు . అయితే ఈ వారం ఎలిమినేషన్ ముఖ్య భూమిక పోషించనుంది. ఎందుకంటె అందరికంటే తక్కువ ఓట్లు ఉన్న సిరి గనక ఇంటినుండి బయటకు వెళ్లే సభ్యుల లిస్ట్ లో గనుక ఉన్నట్లయితే సిరి తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.




అయితే బిగ్ బాస్ అమ్మాయిలను ఇంటినుండి పంపిస్తూ వారిని విజేతలు కాకుండా చేస్తున్నాడు అనే అపోహ అందరిలో ఉన్నందున ఈ వారం బిగ్ బాస్ స్ట్రాటజీ మారవచ్చు. ప్రస్తుతం సిరి , షణ్ముఖ్ మరియు జస్వంత్ ల బాండింగ్ చాల బాగుంది. ముఖ్యంగా సిరి షణ్ముఖ్ ల వ్యవహారం అర్థమై అర్ధం కానట్లు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ గేమ్ స్ట్రాటజీ ఆమెకు కలసివచ్చే అంశం. తన అంద చందాలతో రోజు వీక్షకులను కట్టిపడేస్తున్న సిరి బయటకు వస్తే హౌస్ గ్లామర్ కనుమరుగయ్యే అవకాశం వుంది. ఈ అంశాన్ని గనుక బిగ్ బాస్ పరిగణనలోకి తీసుకుంటే సిరి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వారం సిరి కి అధిక సంఖ్యలో ఓట్స్ పోల్ అవుతాయని ఆశిద్దాం .

మరింత సమాచారం తెలుసుకోండి: