దక్షిణాది సినిమా రంగంలో అగ్ర నటుడిగా కమలహాసన్ కి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే. తన వైవిధ్యమైన నటనతో కొన్ని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు కమల్.ఆయన్ని పొగడని విమర్శకుడు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మరోవైపు ఆయన పొందని ప్రశంస కూడా లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించాడు. కమల్ ఇటీవల మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించి ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో కూడా దూసుకెళ్తున్నాడు ఈ తమిళ సీనియర్ నటుడు. ఇక నేడు కమలహాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల గురించిన కొన్ని విషయాలను ఇప్పుడు మన సమీక్షలు తెలుసుకుందాం. అగ్ర హీరోగా కొన్ని వందల సినిమాల్లో నటించిన కమల్ హాసన్.. ఆస్తులను కూడా భారీగానే కూడా పెట్టుకున్నాడు. కమల్ కి సుమారు 176 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి కమల్ పోటీ చేసిన విషయం తెలిసిందే కదా. ఆ సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు..

 తనకు మొత్తం 176.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నాడు. ఇక వాటిలో ఆయన స్థిరాస్తుల విలువ సుమారు రూ. 131.84 కోట్లు కాగా చరాస్తుల విలువ  రూ. 45.0 9 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా లండన్లో 2.50 కోట్లు విలువ చేసే ఒక ఇల్లు రూ. 2.7 కోట్ల లగ్జరీ కారు ఒక కోటి విలువైన బీఎండబ్ల్యూ కారు ఉన్నట్టు కమలహాసన్ తెలిపాడు. అంతేకాదు తనకు రూ. 49.5 కోట్ల అప్పు ఉన్నట్లు కూడా వెల్లడించాడు. ఇక చదువు విషయానికొస్తే ఆయన కేవలం 8 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారట. ఈ విషయాలన్నింటినీ నామినేషన్ అప్పుడు తన అఫిడవిట్ లో పేర్కొన్నాడు కమల్ హాసన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: