సినిమాలలో పాటలకున్న ప్రత్యేకతే వేరు, ఆ గానం, ఆ మాధుర్యం శ్రోతలను ఉర్రూతలూగించి మరో ప్రపంచానికి తీసుకెళతాయి. సినిమా ప్రమోషన్స్ లో కూడా పాటలు అనేవి కీలక పాత్రను పోషిస్తాయి. ప్రతి సంవత్సరం సినిమాలలో ఎన్నో పాటలు వస్తుంటాయి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే మనసుకి దగ్గరయ్యి ప్రత్యేక ఆదరణ పొందుతాయి. సాంగ్స్ లో పలు రకాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. టైటిల్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, అలాగే సిచ్యువేషన్ సాంగ్స్ ఇలా పలు పాటలు రూపుదిద్దుకుంటాయి. టైటిల్ సాంగ్ అంటే సినిమా పేరుతో వచ్చే సాంగ్స్. ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని చిత్రాలకు టైటిల్ సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ టైటిల్ సాంగ్స్ ను మూవీ ప్రెస్టేజ్ గా భావిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలా చాలా టైటిల్ సాంగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ అన్ని టైటిల్ సాంగ్స్ హిట్ టాక్ ను అందుకోలేవు. అయితే ప్రేక్షకుల మనసు గెలుచుకుని వారిలో హుషారు ను పెంచి సక్సెస్ అయిన కొన్ని టైటిల్ సాంగ్స్ ను చూద్దాం.

* మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు చిత్రంలో "నీ దూకుడు సాటెవ్వరు.." సాంగ్ మంచి హిట్ ను అందుకుంది. సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఇందులో మహేష్ చూపిన మ్యానరిజం ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది.

* మెగాస్టార్ చిరు నటించిన శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ మూవీలో "శంకర్ దాదా ఎబీబీఎస్ హు హ,. హు.. హ"  అనే టైటిల్ సాంగ్ ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ టైటిల్ సాంగ్ అందరి నోట వినబడుతూనే ఉంటుంది.

* జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీలో "మీ తాత టెంపర్, మీ అయ్య టెంపర్.."  అనే టైటిల్ సాంగ్ సినిమా కి హైలైట్ గా నిలిచింది. యువతలో కొత్త జోరును తీసుకొచ్చి దుమ్ము దులిపేసింది.

* రామ్ హీరోగా వచ్చిన ఫుల్లీ  మాస్ మసాలా మూవీ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో.... "ఇస్మార్ట్ శంకర్.." అనే టైటిల్ సాంగ్ ప్రేక్షకులను సీట్లలో కూర్చొనివ్వలేదు మంచి జోష్ తో ప్రతి ఒక్కరూ కాలు కదిపి స్టెప్పు వేసేలా ఫాస్ట్ బీట్ తో అలరించింది ఈ పాట.

*పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీలోని "దేఖో దేఖో గబ్బర్ సింగ్.."
టైటిల్ సాంగ్ పాట రేంజే వేరు...పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ పాట తెగ నచ్చేసింది. పవన్ ఈ పాటలో తను మేనరిజం చూపుతూ వేసిన స్టెప్పులు బాగా హైలైట్ అయ్యాయి.

* అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి మూవీ పెద్ద సక్సెస్ ను అందుకుంది. అలాగే ఈ మూవీ టైటిల్ సాంగ్ అయిన "లాయి లాయి మేహు జులాయి.." అనే సాంగ్ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చి హిట్ ను అందుకుంది.

ఇలా కొన్ని టైటిల్ సాంగ్స్ మాత్రం ఇప్పటికీ ప్రజల గొంతుల్లో నానుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: