మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం క్రాక్ సినిమాతో బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకని  ఫుల్ జోష్ లో ఉన్నాడు, రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను  ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం కొన్ని రోజుల అమృతమే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమా తో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా క షూటింగ్ లో కూడా రవితేజ పాల్గొంటున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తో పాటు రవితేజ, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న ధమాకా సినిమాలో కూడా హీరోగా నటించనున్నాడు.

ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పెళ్లి సందD సినిమా కథానాయిక శ్రీ లిల ను చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరొక పాత్ర కోసం ఈషా రెబ్బ ను చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈషా రెబ్బ పై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ లను సెట్ చేసి పెట్టుకున్న ధమాకా టీం మరొక హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. రవితేజ ఈ మూడు సినిమాలతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కనున్న రావణాసుర సినిమాలో కూడా హీరోగా నటించడానికి రెడీ గా ఉన్నాడు. అలాగే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా నటించడానికి ఇప్పటికే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఇలా రవితేజ వరుస క్రేజీ సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: