తాత నట వారసత్వాన్ని తండ్రి గ్లామర్ ను పుణికి పుచ్చుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రంతో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రశంసలనే కాదు విమర్శలు సైతం స్వీకరించి తనని తాను ప్రేక్షకులకు నచ్చినట్టుగా మార్చుకున్న గొప్ప హీరో చైతు. ఇక నాగ చైతన్య లైఫ్ ఎలా ఉంటుందన్న విషయం గురించి ఇపుడు తెలుసుకుందాం.

నాగ చైతన్య నవంబర్ 23, 1986 లో జన్మించాడు. ఇంటర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా చెన్నైలోనే చదువుకున్నారు చైతు.  కాగా చెన్నై లో పద్మా శేషాద్రి బాలా భవన్ మరియు ఎ ఎం ఎం స్కూల్స్ లో తన స్కూలింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్ లోని సెయింట్ మేరీ కాలేజీలో చేరాడు. తర్వాత యాక్టింగ్ లో శిక్షణ పొంది జోష్ మూవీతో కెరియర్ ను మొదలు పెట్టారు. 2017 లో తను ప్రేమించిన హీరోయిన్ సమంతను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అటు కెరియర్, ఇటు పర్సనల్ లైఫ్ అంతా బాగుంది అనుకున్న సమయం లో సమంత, చైతులు విడిపోయి అందరికీ షాక్ ఇచ్చింది ఈ జంట.

నాగ చైతన్య ఒక్కో సినిమాకి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ పుచ్చుకుంటారు. నాగ చైతన్య వద్ద ఫెరారీ 488 GTB కార్ ఉంది. దీన్ని అచ్చంగా నాలుగు కోట్ల ఎనభై లక్షల పెట్టి కొన్నారు చైతు. నిస్సాన్ GT-R  కార్ కూడా చైతు వద్ద ఉంది. దీని ఖరీదు మొత్తం రెండు కోట్ల ముప్పై లక్షలు. పోర్స్చే టర్బో కార్ కూడా చై గ్యారేజీ లో ఉంది. దీని విలువ రెండు కోట్ల ముప్పై లక్షలు. అదే విధంగా మరో భారీ విలువ గల రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ కార్ కూడా చై గ్యారేజ్ లో ఉంది. దీని ఖరీదు రెండు కోట్ల 75 లక్షలు. కోటి 75 లక్షలు ఖరీదు అయినటువంటి బిఎండబ్ల్యు 730 LD కార్, 30 లక్షలు ఖరీదు అయినటువంటి హోండా CR- v కార్లు నాగ చైతన్య వద్ద ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: