కొంత కాలం క్రితం వరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఓటిటి లోకి చాలా ఆలస్యంగా వస్తూ ఉండేది.  కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు చాలా వరకు తగ్గాయి.  కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లోనే విడుదల అవుతూ ఉంటే, మరికొన్ని సినిమాలు మాత్రం థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని మంచి విజయాలుగా నిలిస్తే మాత్రమే ఆ సినిమాలు  ఓటిటి లోకి కొంత ఆలస్యంగా వస్తున్నాయి. అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నట్లయితే ఆ సినిమాలు అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక  ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.  అయితే ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన స్కైలాబ్ సినిమా జనవరి 14 వ తేదీ నుండి సోని లివ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది.

సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్ నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది. స్కైలాబ్ సినిమా 4 డిసెంబర్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.  విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రసాద్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు. ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన స్కైలాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలై ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా జనవరి 14 వ తేదీ నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది, ఎవరైనా ఈ సినిమా థియేటర్ లో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే సోనీ లివ్ ఓటిటి లో చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: