హీరోయిన్ కియారా అద్వానీ తన సోదరి ఇషితా అద్వాని వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే కియారా అద్వానీ నృత్య ప్రదర్శన చేయడంతో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. ఇండస్ట్రీలో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న కియారా అద్వానీ ఇటీవల గోవాలో తన సోదరి వివాహ వేడుకలలో తనదైన శైలిలో సంబరాలను చేస్తూ అదరగొడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. కియారా అద్వాని సోదరి ఇషితా అద్వాని, భర్త కర్మ వివాన్తో తో కలసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. దీంతో కియారా అద్వాని కి ఆనందానికి అవధులు లేవు.


గత వారం రోజులుగా వీరందరూ పెళ్లి పనుల్లో  వారు బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో కియారా అద్వాని డాన్స్ వేసిన టువంటి ఒక చిన్న క్లిక్ అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోలో చూపించిన మేరకు కియారా అద్వానీ హాటెస్ట్ పింక్ దుస్తుల లో చాలా అందం గా కనిపిస్తోంది. తన హైహీల్ తో, ఫ్లోవి గౌన్ తో , డ్యాన్సింగ్ క్వీన్ గా మెరిసిపోతోంది. ఇక అక్కడికి వచ్చిన బంధువులతో సరదాగా తన సమయాన్ని గడుపుతూ ఉన్నది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక 2019 వ సంవత్సరం లో కియారా తన సోదరి..భర్త కర్మ వివాన్తో నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ ఒక పోస్టును కూడా షేర్ చేయడం జరిగింది. కియారా అద్వాని తన సోదరి పోస్టును తెలియజేస్తూ తన సోదరి సంతోషం కంటే తనకు ఏది గొప్పది కాదు అని తెలియజేసింది. ఇక అంతే కాకుండా తన సోదరి భర్త తన కుటుంబంలోకి స్వాగత్ ఇస్తున్నాము.. తమ కుటుంబం అంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ తెలియజేసింది. వీరిద్దరు జీవితాంతం ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నారని అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కియా రా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: