ఈ మధ్య సినిమా రంగంలో ఎందరో యువ హీరోలు ఎటువంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చి తామేంటో నిరూపించుకుని కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. ఇందుకు చాలా మందిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు... అలంటి వారిలో ఒకరే యువ హీరో సత్యదేవ్. కెరీర్ ఆరంభంలో సహాయక పాత్రలు చేస్తూ మెప్పించిన ఇతను ఈ తర్వాత మెల్ల మెల్లగా హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. సత్యదేవ్ నటుడిగా మొదటి సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ... ఇందులో ప్రభాస్ కు ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు.. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది, మైనే ప్యార్ కియా, ముకుంద మరియు అసుర సినిమాలలో చిన్న పాత్రలు చేశాడు. ఇక హీరోగా తనకు మొదటి సినిమా మాత్రం జ్యోతిలక్ష్మి అని చెప్పాలి.

ఛార్మితో కలిసి ఇందులో సత్య చేసిన పాత్రకు మంచి ఆదరణ దక్కింది. అప్పటి నుండి మంచి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఇతని నుండి వస్తున్న మరో చిత్రం 'గాడ్సే'.. ఇతనికి కెరీర్ లో బ్లఫ్ మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపి గణేష్ దీనికి దర్శకత్వం వహిస్తుండడం ఆకట్టుకునే అంశం. ఇతని సినిమాలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా గోపి గణేష్ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటాడు.  ఈ సారి విద్యావ్యవస్థ గురించి మంచి పాయింట్ ను డీల్ చేస్తున్నాడు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడట.

అయితే పవన్ కొన్ని సినిమాలు మరియు రాజకీయ అంశాలతో బిజీ గా ఉండడం వలన కుదరలేదట. అందుకే తనకు బాగా కలిసొచ్చిన హీరో సత్యదేవ్ తో తీశాడట. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్ లలో ప్రత్యక్షం కానుంది. మరి పవన్ కు అనుకున్న సినిమాను సత్యదేవ్ తో తీశారు. మరి గణేష్ సమాజంపై తీస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.



 

మరింత సమాచారం తెలుసుకోండి: