కరిర్ సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో  మాత్రం సోకులతో జాతర చేస్తుంది ఇలియానా. ఆమె బోల్డ్ నెస్ బౌండరీలు దాటేస్తుండగా, ఇల్లీ బేబీకి ఏమైందని జనాలు  ఎంతో ఆశ్చర్య పోతున్నారు.


తాజాగా బికినీ లో తన అందాలు దాదాపు చూపించేసింది. టాప్ యాంగిల్ నుండి బికినీ ఫోజ్ షేర్ చేసి నెటిజెన్స్ కి సవాలు విసిరింది. ఇలియానా తెగింపు పరాకాష్టకు చేరగా ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలియానా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

 
ఐతే ఇలియానా జోరు సోషల్ మీడియాకే పరిమితం. సిల్వర్ స్క్రీన్ పై ఆమె స్పీడ్  చాలా తగ్గింది. ఫార్మ్ కోల్పోవడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇలియానా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఆమె కెరీర్ ని నాశనం చేశాయి. సౌత్ లో స్టార్ గా వెలిగిపోతున్న టైం లో నార్త్ పై కన్నేసి అసలుకే ఎసరు తెచ్చుకుంది.

 
2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో  బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు.

 
బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల తో చిత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు.

 
ప్రేమ వ్యవహారం కూడా ఇలియానా ప్రస్తుత పరిస్థితికి కారణం. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ తో ఇలియానా కొన్నాళ్ల పాటు రిలేషన్ నడిపారు. ఆండ్రూ 2019లో ఇలియానాకు బ్రేకప్ చెప్పాడు. ఈ పరిణామం ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. కెరీర్ వదిలేసి బరువు పెరిగింది. నాజూకు నడుము ఇలియానా గుర్తు పట్టలేనంతగా లావయ్యారు.

 
ఆ డిప్రెషన్ నుండి బయటపడిన ఇలియానా  తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. అడపాదడపా అవకాశాలు వస్తుండగా, కాదనకుండా చేస్తున్నారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. అడపదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది.

 
ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: