టలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన నటుడు అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అజయ్ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
22 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్న అజయ్ కి .. ఒక హీరోకి ఉన్న ఫాలోయింగ్ కూడా ఉంది. టాలీవుడ్ లో ఉన్న అందరూ టాప్ హీరోలతో కలిసి నటించారు. ఇక ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రకు జీవం పోస్తారు.. ఆ పాత్ర అజయ్ కోసమే రూపొందించారేమో అన్నట్టుగా ఆ పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.
ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లో కూడా అజయ్ ఎన్నో సినిమాలలో నటించారు. ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో నందమూరి తారకరత్న రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వెబ్ సీరీస్ లో అజయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. ఇక అటు సినిమాలపైనే కాకుండా ఇటు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అజయ్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ కూడా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే అంగీకరిస్తాను. అదే పద్ధతిని 22 సంవత్సరాలుగా చేస్తున్నాను. తర్వాత రోజుల్లో కూడా అదే చేస్తాను. ముఖ్యంగా మన క్యారెక్టర్.. సినిమాలలో ఎంతసేపు ఎలా ఉంది? ఎన్నిసార్లు కనిపించింది ? అని కాకుండా ఎంత ప్రభావంతంగా ఉంది? అనేది పరిగణలోకి తీసుకుంటాను.. ఇక ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి నాకు తగ్గ పాత్ర దొరకలేదు.

ఇక నేను 19 సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్ వెళ్లాను. తిరిగి రావడానికి డబ్బులు లేక ఒక హోటల్లో గిన్నెలు కడిగి ఆ డబ్బుతోనే ఇంటికి వచ్చాను.. అంటూ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమాలలో తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటాను. తనకు నచ్చితేనే చేస్తాను అని కూడా చెప్పకు వచ్చారు అజయ్

మరింత సమాచారం తెలుసుకోండి: