జెర్సీ సినిమాతో దేశవ్యాప్తం గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శ కుడు
గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు తెలుగులో మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమ వుతున్నాడు.
బాలీవుడ్ లో తాను దర్శకత్వం వహించిన
జెర్సీ సినిమాను
రీమేక్ చేసి అక్కడ కూడా మంచి గు ర్తింపు సంపాదించుకున్న ఈ ద ర్శకుడు చాలా రోజులుగా చరణ్ తో
సినిమా చేయ డానికి ప్రయత్నాలు చేశాడు కానీ చివరికి ఆ
సినిమా క్యాన్సిల్ అవడంతో ఇప్పుడు మరొక హీరోతో ఆయన
సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.
మొన్నటి దాకా
రామ్ చరణ్ సినిమా దాదాపుగా లేదనే వార్త పుకారు గానే ఉండిపోయింది కానీ నేడు వారి కాంబినేషన్లో
సినిమా లేదని విషయం అధికారికంగా ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు ఈ సినిమాను రౌడీ స్టార్
విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ
సినిమా గురించి అధికారిక ప్రకటన ఇవ్వాలని కొంతమంది
సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.
ఖుషి
సినిమా తర్వాత
విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు చాలా రోజులుగా ఈ దర్శకుడు
విజయ్ దేవరకొండకు కథ చెప్పాడు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే బాగుంటుంది అనేది వారి ఆలోచన. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అని చెబుతున్నారు. జాతీయ అవార్డును అందుకున్న దర్శకుడైన
గౌతమ్ తిన్న నూరి కి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా ఆయనకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోకపోవడంతోనే
రామ్ చరణ్ ఈ సినిమాను క్యాన్సల్ చేయవలసి వచ్చింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ని
విజయ్ దేవరకొండ తో ఎలాంటి
సినిమా ను
గౌతమ్ తెరకెక్కిస్తాడో చూడాలి.