కెరియర్ ప్రారంభంలో సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించి , ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకున్న హిమజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు మరియు బుల్లితెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా అనుపమ పరమేశ్వరన్ , లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా తెరకెక్కిన ఉన్నది ఒకటే జిందగీ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి , తన నటనతో ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో హిమజ ఎక్కువ శాతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. హిమాజ ఎక్కువ శాతం సాంప్రదాయ బద్దంగా మరియు డీసెంట్ గా ఉన్న దుస్తులను ధరించి ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం హిమజ పర్పుల్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి , చాలా క్లాస్ గా ... డీసెంట్ గా ఉన్న ఫోటోలను తను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నేటింట వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హిమజ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకుని , అంతే క్లాస్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: