టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో తో కలిసి  చేసిన వారసుడు సినిమా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది అనే విషయం తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలోనే దిల్ రాజు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశాడు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ముందుగా విజయ్ ని  హీరోగా అనుకోలేదట. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లను ముందుగా అనుకున్నట్టు ఇందులో భాగంగా చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

ఇక వంశీ పైడిపల్లి మొదట ఈ సినిమా కథను మహేష్ బాబుతో చేయాలని భావించారట. మహేష్ బాబు అప్పటికే మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టుకి ఒప్పుకోలేదు. దాని అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అయితే ఈ కథ  బాగుంటుంది అని అనుకున్నారు.ఇక రామ్ చరణ్ కూడా ఆ సమయంలో ఆర్సి15 డిస్కషన్ లో ఉండడంతో వారసుడు సినిమా కథను విజయ్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది.అలా విజయ్ ఈ సినిమాకి ఫైనల్ అయ్యాడు అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇక తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.

ఇక వారసుడు సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్ యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, కుష్బూ, సుందర్ కొన్ని కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్లపై దిల్ రాజు హరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకి వంశీ పైడిపల్లి, హరి, సల్మాన్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. విజయ్ మరియు రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఇక జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం విజయ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: