ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కొన్ని సంవత్సరాల పాటు హిందీ చిత్ర పరిశ్రమ ఏలింది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న ఇండస్ట్రీ అంటే 'బాలీవుడ్' ఇండస్ట్రీ అనే ప్రపంచం అంతా అనుకుంది.ఇండియన్ హాలీవుడ్ గా కూడా బాలీవుడ్ కి మంచి పేరుంది.ఇక వెస్ట్ ఆడియన్స్ కి ఇండియన్ సినిమా అనే మాట వినగానే ముందుగా 'హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ' అనే పదం గుర్తొస్తుంది.అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీ.షారుఖ్ ఖాన్ , ఆమిర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోస్ ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు పొందారు. అలాంటి హీరోలని ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడు పూర్తిగా కష్టాల్లో మునిగిపోయి ఉంది. ఇప్పుడు కొన్ని వివాదాల వల్ల నార్త్ ఆడియన్స్ హిందీ సినిమాలని చూడడానికి థియేటర్స్ కి రావట్లేదు. బాయ్కాట్ ట్రెండ్, అర్బన్ కథలు, రీమేక్ సినిమాలు ఇంకా నెపోటిజం లాంటి ఇష్యూస్ బాలీవుడ్ పతనానికి కారణం అయ్యాయి. అవే ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి 'భూల్ భులయ్య 2' ఇంకా 'దృశ్యం 2' లాంటి సినిమాలు ఈమధ్య కాలంలో కాస్త ఊపిరి పోశాయి. 


అయితే బాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే పది సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితిలో 2022 ఇయర్ కి ఒక గుడ్ ఎండింగ్ ఇస్తారేమో అనే హోప్ కలిగించిన సినిమా రన్వీర్ సింగ్ నటించిన 'సర్కస్'.మాంచి కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే రోహిత్ శెట్టి, హై వోల్టేజ్ కరెంట్ వైర్ లా ఉండే రణవీర్ సింగ్ లు కలిసి చేసిన ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్బంగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే సినిమా ట్రైలర్ తో కొంచెం పర్వాలేదు అనిపించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని 'అవుట్ డేటెడ్' అంటూ ఫిల్మ్ క్రిటిక్ 'తరన్ ఆదర్శ్' ట్వీట్ చేయడం జరిగింది. రోహిత్ శెట్టి సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ సర్కస్ సినిమాలో పూర్తిగా పొయ్యింది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగానే ఉన్నా ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదంటూ అతను తన రివ్యూ ఇచ్చాడు. దీంతో బాలీవుడ్ కష్టాల అకౌంట్లో మరో సినిమా చేరిందంటూ సోషల్ మీడియాలో మళ్ళీ బాలీవుడ్ ని ట్రోల్ చేస్తూ నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ బాలీవుడ్ డౌన్ ట్రెండ్ కి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ అయినా తన 'పఠాన్' సినిమాతో ఎండ్ కార్డ్ వేసి బాలీవుడ్ ని బ్రతికిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: