పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో గబ్బర్ సింగ్ సినిమా కూడా ఒకటి.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలపై ఫోకస్ పెట్టి బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్య వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్షో కి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రశ్నించారు.


ఇక ఈయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం తొలిప్రేమకు బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల తాను పారితోషకాన్ని తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ సినిమా వందరోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాత కొంతమేరకు తనకు ఇచ్చారని తెలిపారు. మరి గబ్బర్ సింగ్ సినిమా కైనా రెమ్యూనరేషన్ ఫుల్ ఇచ్చారా అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా.. హ ఇచ్చారు కానీ అనుకున్నంత ఇచ్చాడు.. నేను అనుకున్నంత ఇవ్వలేదు అంటూ సమాధానం తెలిపారు. దీంతో పవన్ అభిమానులు నిర్మాత బండ్ల గణేష్ ను గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయం గురించి నిలదీయడం జరుగుతోంది.

గబ్బర్ సింగ్ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కు రెమ్యూనరేషన్ విషయంలో గొడవలు జరిగాయ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేటిజన్లు చేసిన ఈ కామెంట్ల పైన బండ్ల గణేష్ స్పందిస్తూ భగవంతుడు అడగడు భక్తుడు ఇస్తాడు బాగుందా తమ్ముడు అంటూ నేటిజన్స్ చేసిన కామెంట్లకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో పవన్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారు బండ్ల గణేష్ ఎంత ఇచ్చారు అనే విషయం మాత్రం ఇంకా పూర్తిగా రాలేదు ఇక ఈ సినిమా నుంచి సక్సెస్ అందుకోవడంతో బండ్ల గణేష్ కు మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: