పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం అమెరికా వెళ్లిన చరణ్.. ఇటీవలే గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో కూడా పాల్గొనడం జరిగింది.ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో ఎంతగానో మునిగి తేలుతున్నారు రామ్ చరణ్. యు.ఎస్‌లో ఇప్పుడందరూ రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ లోని పాపులర్ ఎంటర్‌టైన్మెంట్ చానెల్ KTLA రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది.లాస్ ఏంజిల్స్‌లో మార్చి 12 వ తేదీన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై బాగా దృష్టి పెట్టారు. KTLAకి చెందిన శామ్ రూబిన్ వెర్సటైల్ యాక్షన్ హీరో రామ్ చరణ్‌తో మాట్లాడుతూ ఆస్కార్ నామినేషన్స్ గురించి ఇంకా అలాగే ప్రస్తుతం ఆయన ఆలోచనా విధానంపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.


అదే సమయంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమా టీం చేయబోతున్న లైవ్ పెర్ఫామెన్స్ గురించి అందరిలోనూ తెలియని ఎగ్జయిట్‌మెంట్ నెలకొంది. rrr మేకింగ్ సమయంలో జరిగిన మ్యాజిక్ గురించి ఇంకా అలాగే 'నాటు నాటు..' సాంగ్ తెరకెక్కించేటప్పుడు కలిగిన ఎక్స్‌పీరియెన్స్ గురించి రామ్ చరణ్ ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది.'నాటు నాటు' పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు రావటం ఆస్కార్‌కి ఎంపిక కావటం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా.. అందుకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ' నా జీవితంలో ఇవి అద్భుతమైన క్షణాలు. ఆస్కార్ వేడుకల్లో నేను ఓ గెస్ట్ గా ఉండాలనుకున్నాను.కానీ ఇప్పుడు నామినేట్ అయ్యాను. నేను ఆ బ్లాక్ లేడీని మా టీమ్‌తో కలిసి మా దేశానికి తీసుకెళ్లటానికి చాలా ఎగ్జయిట్మెంట్‌తో  వున్నాను. మార్చి 3 వ తేదీన ఆర్.ఆర్.ఆర్ యు.ఎస్‌లో రీ రిలీజ్ అవుతుంది. కచ్చితంగా మిమ్మల్ని నిరాశ పరచదని భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: