నటిగా ... యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీ ముఖి "భోళా శంకర్" అనే మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తమిళం లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి వేదాళం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. 

చెల్లెలు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి ... శ్రీ ముఖి కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ యూనిట్ చిత్రీకరించినట్లు ... ఆ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో చిరంజీవి ... శ్రీ ముఖి కి మధ్య ఖుషి నడుం సీన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే టీవీ షో ల ద్వారా ... సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యాంకర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ యాంకర్ అదిరిపోయే బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: