అతి కొద్ది మంది దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటారు. అలా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఆఫీస్ దగ్గర అందుకొని ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు.

ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ లోనే ఈ దర్శకుడు స్టార్ దర్శకుడుగా మారిపోయాడు. ఆ తర్వాత ఇదే మూవీ ని హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియర అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ అనే పేరుతో రూపొందించాడు. ఈ మూవీ కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనితో ఈ దర్శకుడి క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అమాంతం పెరిగిపోయింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిమల్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ... అనిమల్ సినిమా అనేది అన్ని గ్యాంగ్ స్టార్ మూవీ లకి బాప్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. సందీప్ నాతో స్టొరీ డిస్కస్ కూడా చేశారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా అనిమల్ మూవీ గురించి చెప్పుకొచ్చారు. ఇలా రామ్ గోపాల్ వర్మ "అనిమల్" మూవీ గురించి వ్యాఖ్యలు చేయడంతో ఈ మూవీ పై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv