ఫిబ్రవరి 1వ తారీఖు సమీపిస్తున్న పరిస్థితులలో ఆరోజు దేశ ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టబోయే సార్వత్రిక బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న విషయమై ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలైపోయాయి. ఆర్ధిక విశ్లేషకుల అంచనాల ప్రకారం 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు పెంచే ఆస్కారం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.


అయితే ఈ పరిమితి మూడు లక్షల వరకు పెంచాలి అన్న డిమాండ్ వస్తున్న పరిస్థితులలో ఎంతమేరకు ఈ డిమాండ్ కు ఆర్ధికమంత్రి ఒప్పుకుంటారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కరోనా సంక్షోభ నేపధ్యంలో కేంద్రప్రభుత్వ ఆర్ధిక వనరులు తరిగిపోయాయని ఇలాంటి పరిస్థితులలో పన్ను చెల్లింపు దారులు అందరికీ ఊరట కలిగించడం కుదరక పోవచ్చని మరొక అంచనా వస్తోంది.


ముఖ్యంగా దేశంలో గృహ కొనుగోళ్ళు ప్రోత్సహించేలా ఈసారి బడ్జెట్ లో ప్రోత్సాహాలు ప్రకటించే అవకాశం ఉండటంతో భారత్ లో హౌసింగ్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది అంటున్నారు. ముఖ్యంగా ఫిక్సెడ్ డిపాజిట్లు జీవిత భీమా ప్రీమియం చెల్లింపులు పిల్లల ట్యూషన్ ఫీజులు చెల్లింపుల పై కూడ పన్ను మినహాయింపులు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. రాబోతున్న బడ్జెట్ లో మౌలిక వసతుల ప్రాజెట్ల పై పెట్టుబడులు పెరిగేలా చర్యలు ఉండాలని పారిశ్రామిక వర్గాలు కోరుకుంటున్నాయి.


అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ల విషయంలో భారీ సంస్కరణలు రాబోతున్నాయని సకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుండి పారిశ్రామిక వేత్తలు వాణిజ్య ఋణాల సేకరణ విషయంలో ఉన్న నిబంధనలను సడలించాలి అన్న అభ్యర్ధన పై కూడ ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తితి తో ఆరోగ్య భీమా ఆవశ్యకత బాగా పెరగడంతో ఆరోగ్య భీమా కంపెనీలకు మరిన్ని రాయితీలు ప్రకటించే ఆస్కారం ఉంది. త్వరలో సెన్సెక్స్ 50 వేల చేరువకు చేరుతుందనే అంచనాలు రావడంతో షేర్ మార్కెట్ విషయంలో కూడ ఎలాంటి రాయితీలు బడ్జెట్ లో ఉంటాయి అన్న ఆశక్తి పెరిగిపోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: