రష్మిక మందాన ఫుల్ ఫామ్ లో ఉంది.. ఇప్పటికే అందరి స్టార్ హీరోల సినిమా లతో ఆమె బిజీ గా ఉంది. అయితే ఇప్పటివరకు ఆమెకు ఇంస్ట్రీ లో పోటీ అయితే లేదు.. కానీ ఇస్మార్ట్ శంకర్ తో మంచి అభినయం కనపరిచిన నభ నటేష్ మాత్రం ఆమెకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు.. తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసిన నభా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది. ఈ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయిన నభా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అందరూ అంచనా వేస్తున్నారు..