పవన్ కళ్యాణ్ మరో సినిమా ని కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా ఓ మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది.. అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కు పవన్ దాదాపు పచ్చ జెండా ఊపేసినట్లే. ఇక రానా సైడ్ నుంచి ఓకె కావాలి. అన్నింటికి మించి ఈ ప్రాజెక్టుకు సరైన డైరక్టర్ కావాలి. పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ లాంటి వాళ్లు కావాలి. కానీ ఎవ్వరూ దరిదాపుల్లో ఖాళీగా లేరు. అదే వెదుకులాట సాగుతోంది. అది ఒక్కటి సెట్ అయిపోతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది. మరి ఈ సినిమా కి ఎవరు దర్శకత్వం వహిస్తారో చూడాలి..