ఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.