ప్రభాస్ క్లాస్ సినిమాలు చేశాడు. మాస్ చిత్రాల్లో నటించాడు. మరి, భక్తిరస ప్రధాన చిత్రాల్లో నటిస్తాడా? ఈ ప్రశ్నకు ఇప్పుడు అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు కృష్ణం రాజు నటించి ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని మరోసారి ప్రభాస్ తో తీయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు కొద్ది రోజుల కిందటే ఆయన ప్రభాస్ తో చర్చలు జరిపారట. అంతేకాదు, ఈ చిత్రంలో ప్రభాస్ నటించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తారు. అయితే... అన్నీ అనుకున్నట్టే అయినా మరో ఏడాది తరువాతే ఈ చిత్రం సెట్టు పట్టాలపైకి వెళ్తుంది. ఎందుకంటే, ప్రభాస్ ‘మిర్చీ’ తరువాత రాజమౌళి చిత్రంలో నటించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: