తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి..తర్వాత హీరోగా మారిన వారు చాలా మంది ఉన్నారు. హీరోగా నటించినా..తర్వాత కమెడియన్లుగానే సెటిల్ అయ్యారు. అందాలరాముడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తర్వాత వరుస హిట్స్ తో మంచి హీరగా గుర్తింపు పొందాడు. బాడీలో పూర్తిగా మార్పు తీసుకు వచ్చి సిక్స్ పాక్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక సునీల్ డ్యాన్స్ సరేసరి..కానీ మనోడికి గత మూడు సంవత్సరాల నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది. దీంతో వరుసగా ఫ్లాపులతో కష్టాల్లో పడ్డారు.
తాజాగా సునీల్ నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ మొన్నటి వరకు బయర్స్ ప్రాబ్లం వచ్చిందని వార్తలు వచ్చాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.... యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్ సరసన అందాల భామ మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతమందించారు. జూన్ లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.