ఆ మద్య మళియాళ నటి భావనపై లైంగిక వేధింపులు కేసు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె డ్రైవర్ మరో ఇద్దరితో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశారు.  ఈ విషయంపై భావన పెద్ద ఎత్తున పోరాటం చేయడమే..కాదు వారికి శిక్ష పడేలా చేసింది.  తర్వాత తన చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌తో ఎంగేజ్ మెంట్ అయ్యింది.  అయితే పెళ్లి విషయం మాత్రం కాస్త లేట్ అవుతూ వచ్చింది. మొత్తానికి నటి కుటుంబంలో  పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి రెండు రోజుల ముందు కొందరు సన్నిహితుల సమక్షంలో భావన మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. 

ప్రస్తుతం ఈ మెహందీ ఫంక్షన్ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భావన పసుపు రంగు దుస్తుల్లో బంగారు బొమ్మలా మెరిసిపోతూంది.  గత ఏడాది మార్చి 9న హీరోయిన్ భావన, కన్నడ నిర్మాత నవీన్ ల నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే.  చాలా గ్యాప్ తీసుకొని ఈ జంట నేడు కేరళలోని త్రిసూర్ లోని కన్వెన్షన్ సెంటర్ లో వివాహం చేసుకొనున్నారు.

ఇప్పటికే వివాహ వేడుక నిమిత్తం ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులు హాజరు కావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొన్నది.
పసుపు రంగు దుస్తుల్లో మేలిమి బంగారంలా భావన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
bhavana-01
ఈ ఫంక్షన్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భావన వివాహాన్ని సింపుల్‌గా నిర్వహిస్తున్నామని ఆమె సోదరుడు జయదేవ్‌ మీడియాకు తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: