భారతీయ చలన చిత్ర రంగంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి..ఆ తర్వాత చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎదిగారు శ్రీదేవి.  తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లాంటి హీరోలతో నటించి..ఆ తర్వాత కృష్ణ,శోభన్ బాబు రెండో తరం హీరోలతో నటించింది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి మూడో తరం హీరోలతో హీరోయిన్ గా నటించి గొప్ప శ్రీదేవికే దక్కుతుంది.  శ్రీదేవి దుబాయ్ లో  ఓ హోటల్ లో బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయిన విషయం తెలిసిందే. 
Image result for sridevi childhood
అయితే ఇండస్ట్రీలో కొంత కాలంగా ఒకటే టాపిక్ నడుస్తుంది.. శ్రీదేవిక ఆస్తులు ఎంత కూడబెట్టిందని.   చిన్నతనం నుండి తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించింది. తల్లి అనవసరపు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన దాదాపు ఆస్తి మొత్తం కొల్పోయింది. శ్రీదేవి బోనీకపూర్ పెళ్లి టైంకి ఆమె వద్ద పెద్దగా ఆస్తులు ఏమీ లేవని ఆమె కుటుంబ సభ్యుల కామెంట్స్. అయితే చిన్నప్పటి నుండి తన సినిమాల రెమ్యునరేషన్ గురించి ఆమె తండ్రి చూసుకునేవాడు. నిర్మాతలు బ్లాక్ మనీ ఇస్తుండటంతో తనకు నమ్మకమైన స్నేహితులు, బంధువులు వద్ద ఉంచారు.
Image result for sridevi
ఎంతో నమ్మకం పెట్టుకున్న బంధువులు ఆయన మరణం తర్వాత ఆస్తులు ఇవ్వకుండా మోసం చేశారట. ఆ తర్వాత శ్రీదేవి ఆర్థిక వ్యవహారాలు ఆమె తల్లి రాజేశ్వరి చూసుకోవడం మొదలు పెట్టింది. ఈమెకు కూడా పెద్దగా పరిజ్ఞానం లేకపోవడంతో..లిటికేషన్ లో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. అంతే కాదు ప్రాణప్రదంగా చూసుకున్న ఆమె చెల్లెలు శ్రీలత కూడా మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. శ్రీదేవి చ‌నిపోయో నాటికి ఆస్తులు చూసుకుంటే ముంబాయిలోని అందేరి ప్రాంతంలో విలాసంతమైన భవంతి ఉంది ఆ ఇంటి కరీదు 220 కోట్లు ఉంటుందని అంచనా. 
Image result for sridevi
ఇంగ్లీష్ వింగ్లీష్ తో రీ ఎంట్రీ ఇచ్చి ఈ మద్య కాలంలో పదకొండు కోట్ల ఆస్తులు కూడబెట్టిందట. అయితే శ్రీదేవి కుటుంబానికి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో రెండు కోట్లు విలువ చేసే బెంట్లీ కారు కూడా ఉంది. అవన్నీ శ్రీదేవి పేరు మీదే ఉన్నాయి. ఈ కర్ల విలువ తొమ్మిది కోట్లు ఉండచ్చని అంచనా. శ్రీదేవి పేరు మీద 620 కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా శ్రీదేవి ఆస్తులు ఇద్దరు కూతుళ్లు అయిన జాహ్నవి, ఖుషీ కపూర్లకు చెందుతుందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: