నందమూరి ఫ్యామిలీలో విభేదాలు గురించి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ, హరికృష్ణ ఫ్యామిలీకి మాటలను లేవన్న సంగతి ఓపెన్ సీక్రెట్. అలాగే నందమూరి ఫ్యామిలీలో మరో స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య కూడా మాటలు లేవన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విభేదాలు బాలయ్య కు మరియు కళ్యాణ్ రామ్ కు మధ్య కూడా ఉన్నట్లు కూడా కళ్యాణ్ రామ్ మాటలను బట్టి అర్ధం అవుతుంది.
మా బాలయ్య బాబాయ్ అంటూ ఎన్టీఆర్ ఇన్నాళ్లు చంకలు గుద్దుకోవడం తప్ప బాండింగ్ లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక చూసి చూసి జూనియర్ సహనం కూడా నశించింది. పోతే పోయిన బాబాయ్ లే అని పక్కనబెట్టిన్నట్లు తాజాగా జూనియర్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. గురువారం జూనియర్ ఎన్టీఆర్-ప్రణీత దంపతులకు పండండి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని తారక్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. నా కుటుంబం మరింత పెద్దదైంది.
మళ్లీ బాబు పుట్టాడు. నా బలం పెరిగింది అన్నట్లు మీనింగ్ వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. ఆయన మాటలను బట్టి జూనియర్ బాలయ్య ఫ్యామిలీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సహనంతో బాబాయ్ ఎప్పటికైనా ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడని భావించినా ఇప్పటివరకూ అది జరగలేదు. ఇక విసుగుపోయినా జూనియర్ చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తారక్ కు బాబు పుట్టిన విషయం తెలుసుకున్న టాలీవుడ్ సెల బ్రిటీలంతా శుభాకాంక్షలు తెలిపారు. కానీ బాలయ్య మాత్రం చెప్పింది లేదు.