మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  మొదటి సినిమా గంగోత్రి చిత్రంతో పెద్దగా పేరు రాకున్న తర్వాత వచ్చిన ‘దేశముదురు’, ‘ఆర్య’, ‘బన్ని’ లాంటి చిత్రాలతో మనోడు మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు.  ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ మద్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం నుంచి మంచి విజయాలు అందుకుంటూ వచ్చాడు.  

Image result for allu arjun

ఈ మద్య ‘నా పేరు సూర్య’ చిత్రంతో మంచి విజయం అందుకున్న బన్నీ ప్రస్తుతం డైరక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ‘మనం’, ‘24’, ‘హలో’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విక్రమ్ కుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీయబోయే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఇక  సినిమా సినిమాకు జోనర్ మార్చడం అన్నది డైరక్టర్ విక్రమ్ కుమార్ స్టయిల్. మాంచి ఫీల్ గుడ్ యూత్ లవ్ ఎంటర్ టైనర్లు చేయగలడని, ఏ జోనర్ సినిమా తీసినా పేరు తెచ్చకున్నాడు.

Image result for director vikram kumar

 ఈసారి విక్రమ్ కుమార్,  బన్నీకి ఉన్న మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని  మాస్ ఎంటర్ టైనర్ చేయాలని విక్రమ్ కుమార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. క్రమ్ కుమార్ లేటెస్ట్ సినిమా హీరోతో బన్నీతో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో వుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే స్క్రిప్ట్ లాక్ చేసారు.శానం నాగఅశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జి కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: